అయినా.. మొబైల్ ఫోన్ ధరలు తగ్గవు
మొబైల్ ఫోన్ల తయారీలో వాడే కొన్ని కీలక వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్లో తగ్గించారు. ఫోన్లలో ఉండే కెమెరాల కోసం వాడే లెన్స్‌పై ఇపుడు కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 15 శాతం దాకా ఉంది. దీన్ని 5 శాతానికి తగ్గించారు. అలాగే చార్జర్లు, అడాప్టర్ల తయారీకి వాడే ట్రాన్స్ఫార్మర్ల భాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించారు. తగ్గించిన డ్యూటీ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. అయితే ఈ తగ్గింపును కంపెనీలు కస్టమర్లకు అందించవని తయారీదారులు అంటున్నారు. చిప్ వంటి మరికొన్ని విడిభాగాల ధరలు ఇటీవల బాగా పెరిగాయని… దీంతో ఈ తగ్గింపు కంపెనీలే వాడుకుంటాయని.. మొబైల్ ఫోన్ల ధరలను తగ్గించవని తయారీదారులు అంటున్నారు.