For Money

Business News

అరశాతం నష్టంతో నిఫ్టి

ఉదయం నుంచి రెండు సార్లు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిన నిఫ్టి… ఇపుడు దాదాపు అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టికి దిగువ స్థాయలో మద్దతు అందుతున్నా… అధిక స్థాయిలో ఒత్తిడి వస్తోంది. ఈ నెలాఖరుతో ట్యాక్స్‌ సేవింగ్స్ చేయాల్సిన వారు చాలా మంది తమ హోల్డింగ్స్‌లో నష్టాలతో ఉన్న అనేక షేర్లను వొదిలించుకుంటున్నారు. నిఫ్టి ప్రస్తుతం 74 పాయింట్ల నష్టంతో 17,171 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి అత్యధిక శాతం ఒత్తిడి బ్యాంక్‌ నిఫ్టి నుంచి వస్తోంది. ఇవాళ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 4 కోట్ల షేర్లు రూ.1700 వద్ద బ్లాక్‌ డీల్ కింద చేతులు మారాయి. దీంతో చాలా వరకు ప్రైవేట్ బ్యాంకులు భారీ నష్టాలతో ఉన్నాయి. ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా కొటక్‌ స్థాయిలోనే మూడు శాతం నష్టంతో ట్రేడవుతోంది. మిగిలిన సూచీల్లో నిఫ్టి నెక్ట్స్‌లో పెద్దగా నష్టాలు లేవు. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 0.6 శాతం లాభంతో ఉంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ కావడంతో నిఫ్టిలో షార్ట్‌ కవరింగ్‌ వస్తుందేమో చూడాలి.