రాణించిన మిడ్ క్యాప్స్

ఓపెనింగ్‌లో నష్టాల నుంచి ఒక మోస్తరు లాభాల్లోకి వచ్చిన మార్కెట్… పై స్థాయిలో నిలబడలేకపోయింది. నిఫ్టి 10.30 గంటల నుంచే బలహీనపడటం ప్రారంభమైంది. పలు మార్లు నష్టాల్లోకి వెళ్ళి గ్రీన్‌లో వచ్చింది. చివరల్లో కూడా ఒక మోస్తరు నష్టాల నుంచి కోలుకుని కేవలం 12 పాయింట్ల నష్టంతో 22932 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి మినహా పలు ప్రధాన సూచీలు ఇవాళ గ్రీన్‌లో ముగియడం విశేషం. ఆరంభంలోనే నష్టాల్లో ఉన్నా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు సూచీలు లాభాల్లోకి రావడమేగాక… దాదాపు ఒక శాతంపైగా లాభాన్ని నిలబెట్టుకున్నాయి. అలాగే బ్యాంక్, ఎన్బీఎఫ్సీ కౌంటర్లు కూడా బాగున్నాయి. ఓవర్ ఆల్గా మార్కెట్ టోన్ బుల్లిష్‌గా ఉండటం విశేషం. ఇవాళ 2926 షేర్లు ట్రేడవగా, 2145 షేర్లు లాభాల్లో ముగిశాయి. పలు షేర్లలో కొత్తగా లాంగ్ పొజిషన్స్ ఏర్పడటమే గాక… పలు కౌంటర్లలో షార్ట్ కవరింగ్ కూడా వచ్చింది. ఇవాళ మెటల్స్ బాగున్నాయి. నిఫ్టిలో బీఈఎల్ టాప్ గెయినర్ కాగా, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్‌గా నిలిచింది.