For Money

Business News

దుమ్ము రేపిన మిడ్‌ క్యాప్స్‌

ఎఫ్‌ఎంసీజీ రంగం వినా మిగిలిన అన్ని రంగాల సూచీలు ఇవాళ గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి ఇవాళ ఉదయం కాస్త బలహీనంగా కన్పించినా.. ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ బలపడింది. ముఖ్యంగా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లలో గట్టి మద్దతు లభించింది. అలాగే బ్యాంకులకన్నా ఎన్‌బీఎఫ్‌సీల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్‌ వచ్చింది. ముఖ్యంగా బజాజ్‌ ట్విన్స్‌ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 52 వారాల గరిష్ఠ స్థాయి తాకేందుకు రెడీ అవుతోంది. ఉదయం 22976 పాయింట్లను తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 23183 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. దాదాపు అదే స్థాయిలో 217 పాయింట్ల లాభంతో 23174 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 41 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ 2908 షేర్లు ట్రేడవగా 2313 షేర్లు గ్రీన్లో ముగిశాయి. ఇవాళ నిన్నటికి భిన్నంగా అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన షేర్ల సంఖ్య 212 కాగా, లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ముగిసిన షేర్ల సంఖ్య 84. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో శ్రీరామ్‌ పైనాన్స్‌ నిలిచింది. ఈ షేర్‌ 4 శాతం దాకా లాభపడింది. తరవాతి స్థానంలో ఉన్న బీఈఎల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ట్రెంట్‌ షేర్లు మూడు శాతం లాభంతో ముగిశాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఐటీసీ హోటల్స్‌ నిలిచింది. ఈ షేర్‌ 173.65 వద్ద ముగిసింది. ఇవాళ లిస్టయిన ఈ షేర్‌ రూ. 180 గరిష్ఠ స్థాయిని తాకింది.