ఇవాళ కూడా మిడ్ క్యాప్దే…

నిఫ్టి ఇవాళ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనైంది. ఓపెనింగ్‌లో ఫ్లాట్‌గా ఉన్నా… వెంటనే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 24767ని తాకింది. అయితే మిడ్ సెషన్ కల్లా నష్టాల్లోకి జారుకుంది. 24535ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుని 88 పాయింట్ల లాభంతో 24666 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి నష్టాల్లో ముగిసింది. అయితే మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం ఒక శాతంపైగా లాభంతో క్లోజైంది. మెజారిటీ ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ నిఫ్టి 2960 షేర్లు ట్రేడవగా, 2183 షేర్లు లాభాల్లో ముగిశాయి. కేవలం 694 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఏకంగా 200 షేర్లు అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ కావడం విశేషం. నిఫ్టిలో టాప్ గెయినర్‌గా టాటా స్టీల్ నిలిచింది. శ్రీరామ్ ఫైనాన్స్, బీఈఎల్, హిందాల్కో, టెక్ మహీంద్రా తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇక నష్టాల్లో ముగిసిన షేర్లలో ఏషియన్ పెయింట్ టాప్‌లో నిలిచింది. తరవాతి స్థానాల్లో సిప్లా, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ నిలిచాయి.