For Money

Business News

మిడ్‌ క్యాప్స్‌కు మంచి రోజు

చాలా రోజుల తరవత మిడ్‌ క్యాప్‌ షేర్లతో పాటు స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ కన్పించింది. ఉదయం నిఫ్టి నష్టాల్లో ప్రారంభమైనా… కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. మిడ్‌ సెషన్‌ కల్లా 23090 నుంచి 23270 పాయింట్లకు చేరింది. తరవాత లాభాల స్వీకరణ కారణంగా 23205 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్‌ 116 పాయింట్లు లాభపడింది. ఇవాళ నిఫ్టిలో 30 షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే ట్రేడైన 2888 షేర్లలో సగానికిపైగా షేర్లు అంటే 1575 షేర్లు లాభాల్లో ముగిశాయి. చాలా రోజుల తరవాత సిమెంట్ల షేర్లలో ఆసక్తి కన్పించింది. అల్ట్రాటెక్‌, గ్రాసిం షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక విప్రోలో ఇవాళ కూడా ఆసక్తి కన్పించింది. నిఫ్టి లూజర్స్‌లో బీపీసీఎల్‌ టాప్‌లో నిలిచింది. తరవాత కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ షేర్లు ఉన్నాయి. ఇవాళ స్టార్‌ షేర్లు మిడ్‌ క్యాప్‌. మిడ్‌ క్యాప్‌ సూచీ రెండు శాతంపైగా పెరగ్గా, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఒక శాతంపైగా లబ్ది పొందాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లలో మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లదే హవా. కోఫోర్జ్‌, పర్సిస్టెంట్‌ షేర్లు పది శాతంపైగా లాభపడ్డాయి. గతకొన్ని రోజులుగా పడుతూ వచ్చిన డిక్సన్‌లో ఇవాళ 5 శాతం పెరిగింది. అరబిందో ఫార్మా నాలుగు శాతం పెరగ్గా, ఎంఫసిస్‌ మూడున్నర శాతం లాభంతో ముగిసింది.