3 శాతం మంది ఉద్యోగులు ఔట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వందల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్న మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలో తన సిబ్బందిలో 3 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సుమారు 7000 ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. 2023 తరవాత భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది ఏకంగా పది వేల మందిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. పెద్ద ఐటీ కంపెనీలు ఏఐపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అదే సమయంలో ఇపుడున్న సిబ్బందిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. గత ఏడాది వేల మందిని గూగుల్ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఏడాది ఏఐపై సుమారు 8000 కోట్ల డాలర్లను వెచ్చించాలని మైక్రోసాప్ట్ నిర్ణయించింది.