For Money

Business News

భాగస్వామి కోసం మెట్రో వేట

క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని జర్మనీ రిటైల్‌ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి భాగస్వామి కోసం ప్రయత్నిస్తోంది. ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, థాయ్‌లాండ్‌కు చెందిన చారొయెన్‌ పోక్‌ఫాండ్‌ (సీపీ) గ్రూప్‌లతో పాటు రిలయన్స్‌ రిటైల్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌(డీమార్ట్‌ మాతృసంస్థ), టాటా, లులు గ్రూపులు, పీఈ ఫండ్‌ సమారా క్యాపిటల్‌లు ఇప్పటికే మెట్రోతో సంప్రదింపులు జరుపుతున్నాయి. హోల్‌సేల్‌ వ్యాపారం బాగా అభివృద్ధి చెందే అవకాశముందని, ఇపుడున్న వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని మెట్రో అధికారి తెలిపారు. దేశంలో 2003 నుంచి మెట్రో 31 క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్స్‌ను నిర్వహిస్తున్నది. భారత్‌లో తమ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టామని మీడియాలో వస్తున్న వార్తలపై మెట్రో ఏజీ సంస్థ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ గెర్డ్‌ కొస్లోస్కి స్పందిస్తూ దేశంలోని తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశాల్ని తాము పరిశీలిస్తున్నామని… మార్కెట్‌ వదంతులపై తాము వ్యాఖ్యానించబోమన్నారు. పలు పెద్ద సంస్థలు బీ2బీ విభాగంలో మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు ప్రతీ ఏడాది మిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతుండగా, మెట్రో ఒక్కటే లాభాల్ని ఆర్జిస్తున్నదని ఆయన వివరించారు. మెట్రోకు బెంగళూరులో ఆరు, హైదరాబాద్‌లో నాలుగు స్టోర్లు ఉన్నాయి.