For Money

Business News

ఐస్‌ ముక్కల్లా కరిగిన మెటల్‌ షేర్లు

మెటల్స్‌లో దాదాపు ఒక నెల రోజుల నుంచి కొనసాగుతున్న డౌన్‌ట్రెండ్‌ ఇపుడు స్పీడు అందుకుంది. తొలుత చైనాలో కరోనా కారణంగా మెటల్స్‌ క్షీణించగా ఇపుడు మాంద్యం కారణంగా మెటల్స్‌ ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్‌లో మెటల్స్‌ పతనం ప్రపంచ మార్కెట్లను కంగారు పెట్టిస్తోంది. ఇక మన మార్కెట్‌ విషయానికొస్తే దాదాపు అన్ని రకాల మెటల్‌ షేర్ల ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ నిఫ్టిలో టాప్‌ లూజర్స్‌ అన్నీ మెటల్‌, మెటల్‌ సంబంధిత రంగాలే కావడం విశేషం. హిందాల్కో, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌. ఈ షేర్లు మూడు శాతం నుంచి ఆరు శాతం దాకా క్షీణించాయి. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో వేదాంత, సెయిల్‌, ఎన్ఎండీసీ షేర్లు టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. వేదాంత ఏకంగా 12 శాతం నష్టపోయింది. సెయిల్ అయిదు శాతంపైగా క్షీణించింది. ముడి చమురు ధరలు పది శాతం క్షీణించినా… మార్కెట్‌ నష్టాల్లోకి జారుకోవడానికి కారణం ఇదే. ఈఏడాది రుతుపవనాలపై కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మార్కెట్‌ వర్గాలకు రుతుపవనాలపై అంచనాలు ఉన్నాయి. జూన్‌ నెల వర్షాలపై భారత వాతావరణ విభాగం ఇస్తున్న గణాంకాలకు భిన్నంగా దేశంలో పరిస్థితి ఉందని తెలుస్తోంది.