For Money

Business News

నిఫ్టికి మెటల్స్‌ అండ

నిఫ్టికి ఇవాళ మెటల్స్‌ అండగా నిలిచాయి. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి మద్దతు అందలేదు. దీంతో నిఫ్టి 16,592ని తాకి వెనక్కి తగ్గింది. 16,553 పాయింట్లు తాకిన తరవాత 16,569 వద్ద 118 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి 16,520-16,540 మధ్య ఉన్నంత వరకు పరవాలేదు. నిఫ్టి గనుక 16,520 స్థాయికి దిగువకు వస్తే నిఫ్టి 16,465ని తాకే అవకాశముంది. అయితే యూరో మార్కెట్లు గట్టిగా ఉండే పక్షంలో నిఫ్టి 16540పైనే ఉండే అవకాశముంది. కొత్త కంపెనీ డీల్‌ను రద్దు చేయడంతో అరబిందో ఫార్మా 5 శాతం దాకా లాభపడింది.అలాగే వ్యాక్సిన్‌కు అనుమతి లభించడంతో క్యాడిలా షేర్‌ 7 శాతం దాకా లాభపడింది. శుక్రవారం భారీగా క్షీణించి మెటల్స్‌ ఇవాళ గ్రీన్‌లో ఉంటే… ఆరోజు నిఫ్టికి అండగా నిలిచిన ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి లోని 50 షేర్లలో 47 షేర్లు లాభాల్లో ఉన్నా… నిఫ్టి ఒక మోస్తరు లాభాలకే పరిమితమైంది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఒకశాతం లాభపడింది. ఇతర సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా స్టీల్‌ 1,405.00 2.14
హిందాల్కో 412.00 2.07
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 697.95 1.95
టాటా మోటార్స్‌ 287.80 1.66
హెచ్‌డీఎఫ్‌సీ 2,756.80 1.28

నిఫ్టి టాప్‌ లూజర్స్
టాటా కన్జూమర్స్‌ 843.35 -0.47
హిందుస్థాన్‌ లీవర్‌ 2,610.50 -0.34
అదానీ పోర్ట్స్‌ 685.80 -0.20