హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా
ఇప్పటికే హైడ్రోకార్బన్స్ రంగంలో అన్ని విభాగల్లోనూ విస్తరించిన మేఘా గ్రూపు ఇపుడు హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి కూడా విస్తరిస్తోంది. మేఘా గ్రూపు కంపెనీ డ్రిల్మెక్ ఎస్పీఏతో కలిసి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది.ఈ ప్రాజెక్టు కింద 3.5 కోట్ల యూరోల (దాదాపు రూ.300 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఇటలీలోని పియుచెంజాలో జరిగిన డ్రిల్మెక్ బోర్డు సమావేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.