మెదాంత పబ్లిక్ ఆఫర్ రేపే
మెదాంతా పేరుతో ప్రముఖ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ పబ్లిక్ ఆఫర్ రేపు ప్రారంభం కానుంది. ఆఫర్ ఏడున ముగుస్తుంది. రూ. 2 ముఖ విలువ కలిగిన షేరు ధరల శ్రేణిని రూ. 319 నుంచి రూ. 336గా ఖరారు చేశారు. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 2206 కోట్లను సేకరించాలని గ్లోబల్ హెల్త్ నిర్ణయించింది. ఈ ఐపీఓలో లాట్ సైజ్ 44 షేర్లు కాగా, రిటైర్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు మొత్తం 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ ఆఫర్లో 35 శాతం షేర్లను రీటైల్ ఇన్వెస్టర్లకు అలాట్ చేశారు. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించే మొత్తాన్ని సంస్థ విస్తరణ కోసం వినియోగిస్తారు. ఈనెల 11 న షేర్ల అలాట్ మెంట్ ఉంటుంది. 15వ తేదీన షేర్లు పొందినవారి ఖాతాల్లోకి షేర్లు క్రెడిట్ అవుతాయి. అలాట్ కానివారికి ఖాతాల్లోకి 14న రీఫండ్ చేస్తారు. 16న షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. ప్రస్తుతం అనధికార మార్కెట్లో ఈ షేర్లు రూ. 25 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నందున ఈ పబ్లిక్ ఆఫర్‌కు మంచి ఆదరణ లభించే అవకాశముంది.