షేర్‌కు ఫలితాల షాక్

మారుతీ సుజుకీ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. ఒకదశలో రూ. 10,742కు పడిన ఈ షేర్ తరవాత కోలుకుని రూ. 11,046 వద్ద 3.81 శాతం నష్టంతో క్లోజైంది. గత ఆగస్టు 1న ఈ షేర్ ధర రూ.13,680 అప్పటి నుంచి ఈ షేర్ దాదాపు 25 శాతంపైగా క్షీణించింది. గత ఏడాదితో పోలస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 3786 కోట్ల నుంచి రూ. 3102కి పడిపోయింది. అయితే ఆదాయం మాత్రం రూ. 37,339 కోట్ల నుంచి రూ. 37,449 కోట్లకు చేరింది. దేశీయ మార్కెట్‌లో కంపెనీ అమ్మకాలు 4 శాతం క్షీణించగా, ఎగుమతులు 12 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.