మారుతీ షేర్ టార్గెట్ ఎంత?

మారుతీ జుసుకీ ఇండియా కంపెనీ షేర్ మార్కెట్లో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. తొలిసారి మార్కెట్లోకి ఈవీని తీసుకు రావడంతో పాటు డిసెంబర్ త్రైమాసికంలో ఫలితాలు బాగుండటంతో బ్రోకరేజీ సంస్థలు షేర్ టార్గెట్‌ను పెంచుతున్నారు. పైగా ఆటో రంగంలో ఇపుడు బూమ్ టైమ్ నడుస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.3,727 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2023-24 ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.3,207 కోట్లు. అంటే కంపెనీ నికర లాభం 16 శాతం పెరిగింది. ఇదే సమయంలో టర్నోవర్ కూడా రూ.33,513 కోట్ల నుంచి రూ.38,764 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 5,66,213 వాహనాలను అమ్మింది. 2023-24 డిసెంబరు త్రైమాసిక అమ్మకాలంతో పోలిస్తే అమ్మకాలు 13% పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.