భారత్‌లో మారుతీ ఈవీ రెడీ
మన మార్కెట్లో ప్రవేశ పెట్టేందుకు ఎలక్ట్రానిక్ వెహికల్ రెడీగా ఉందని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఆ కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి తకేయూచి మీడియాతో మాట్లాడుతూ తమ ఈవీ కారు 500 కి.మీ. దూరం ప్రయాణించగలని, 60 కిలోమాట/గంటకు బ్యాటరీతో కారు సిద్ధమౌతోందని తెలిపారు. భారత్‌లో తయారు చేసే మారుతీ ఈవీని యూరప్‌తో పాటు జపాన్ మార్కెట్‌కు కూడా ఎగుమతి చేస్తామని ఆయన చెప్పారు. కస్టమర్ల అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈవీ తయారు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీ సమస్యలతో పాటు సర్వీస్ సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. భారత దేశ యువతకు కేవలం మాన్యూఫ్యాక్చరింగ్ మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించగలదని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలదని ఆయన చెప్పారు.