For Money

Business News

స్థిరంగా నిఫ్టి… గ్రీన్‌లో అమెరికా ఫ్యూచర్స్‌

ఈస్టర్‌ పండుగ సందర్భంగా నిన్న యూరో మార్కెట్లకు సెలవు. అమెరికా మార్కెట్లు రాత్రి స్వల్ప నష్టాలతో ముగిశాయి. కాని ఇవాళ యూరో మార్కెట్లు ఏకంగా ఒక శాతం నష్టంతో ప్రారంభమయ్యాయి. దీంతో ఉదయం నుంచి కాస్త లాభాల్లో ఉన్న మన మార్కెట్లు మళ్ళీ నష్టాల్లోకి జారాయి. అయితే యూరో మార్కెట్ల నష్టాలు తగ్గడం ప్రారంభమైంది. దీంతో నిఫ్టి ఇపుడ స్వల్పంగా కోలుకుని 56 పాయింట్ల లాభంతో 17229 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ ఇపుడు కూడా నిఫ్టి టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. నిఫ్టిలో 32 షేర్లు గ్రీన్‌లో ఉన్నా సూచీలో ఆ బలం లేదంటే… షేర్లన్నీ నామ మాత్రపు లాభాలతో ఉన్నాయన్నమాట. టెక్‌ షేర్లు కూడా ఇంకా డల్‌గా ఉన్నాయి. కోల్‌ ఇండియా, అపోలో హాస్పిటల్స్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యూరో నష్టాల్లో ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే నిఫ్టి17300పైన ముగిసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.