65 పాయింట్ల లాభంలో SGX నిఫ్టి
రాత్రి నుంచి ఈక్విటీ మార్కెట్లు బలంగా ఉన్నాయి. నిన్న నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్ క్లోజింగ్‌కల్లా లాభాల్లోకి వచ్చింది. అత్యధికంగా ఎస్ అండ్ పీ 500 సూచీ 0.95 శాతం లాభంతో క్లోజ్ కాగా, నాస్‌డాక్ కూడా అంతే లాభంతో ముగిసింది. ఇక డౌజోన్స్ 0.8 శాతం లాభంతో క్లోజైంది. రాత్రి డాలర్ పెరిగినా మార్కెట్ గ్రీన్‌లో ముగియడం విశేషం. పైగా క్రూడ్ ఆయిల్ ధరలు 121 డాలర్లను దాటాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. హాంగ్‌సెంగ్ అన్ని సూచీలకన్నా అధికంగా 1.36 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక నిక్కీ కూడా ఒక శతం లాభంతో సాగుతోంది. చైనా మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు 0.77 శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి ఇపుడు 65 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కావడం పక్కాగా కన్పిస్తోంది.