స్థిరంగా సాగుతున్న మార్కెట్లు
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే 17559ని తాకిన నిఫ్టి .. తరవాత స్వల్పంగా నష్టపోయి 17,486ని తాకింది. ఇపుడు 17557 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 59 పాయింట్లు లాభపడింది. నిఫ్టి ఒకదశలో నష్టాల్లోకి వెళ్ళింది. రష్యా నుంచి 30 శాతం డిస్కౌంట్‌తో క్రూడ్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోందన్న వార్తలతో నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చింది.నిఫ్టిలో 32 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. మెటల్స్ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగుతోంది. హిందాల్కో టాప్ లూజర్‌గా నిలిచింది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. లాభాలు అర శాతం లోపే ఉన్నాయి. మరి మిడ్ సెషన్ తరవాత ఈ లాభాలు కొనసాగుతాయా అన్నది చూడాలి.