ఫ్లాట్‌గా ఆరంభం

మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభం కావడం విశేషం. ప్రస్తుతం నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ఉంది. ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన బ్యాంక్ నిఫ్టి వెంటనే కోలుకుని గ్రీన్‌లోకి వచ్చింది. స్మాల్ క్యాప్ షేర్లు ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి.నిఫ్టి టాప్ గెయినర్స్‌లో బీఈఎల్, రిలయన్స్ షేర్లు రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ సూచీలో ఎస్‌ఆర్‌ఎఫ్ రెండున్నర శాతం లాభంతో టాప్ గెయినర్‌గా ఉంది. పీఐ ఇండస్ట్రీస్ 2.7 శాతం నష్టంతో ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఈ సంస్థలు నికరంగా రూ.2,377 కోట్ల విలువైన షేర్లను అమ్మాయి.