For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాతో సూచీలు కొనసాగుతున్నాయి. నిఫ్టి 25000పైన కొనసాగుతోంది. ఒకదశలో 24,981కి క్షీణించినా..నిఫ్టి కోలుకుంది. నిఫ్టికి మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు అండగా ఉంటున్నాయి. ముఖ్యంగా క్రూడ్‌ ఆధార కంపెనీల షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడుతున్నాయి. అలాగే ఆటో కంపెనీల షేర్లు కూడా. మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా ఉన్నాయి. ఇక నిఫ్టి లూజర్స్‌లో టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, హీరో మోటోకార్ప్, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ ఉన్నాయి.

Leave a Reply