లాభాల్లో ప్రారంభం…

మార్కెట్ ఇవాళ లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 86 పాయింట్ల లాభంతో 22915 వద్ద ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లో నిఫ్టి 22973ని తాకింది. ఆర్బీఐ మార్కెట్ నుంచి రూ. 60,000 కోట్ల మేర బాండ్లను అమ్మాలని నిర్ణయంచడంతో… బ్యాంక్ నిఫ్టి ఒక శాతంపైగా లాభంతో ఉంది. మార్కెట్‌లో లిక్విడిటీ పెంచేందుకు ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. దీంతో బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మిడ్ క్యాప్ షేర్లలో పెద్ద మార్పు లేదు. స్మాల్ క్యాప్ షేర్ల సూచీ కేవలం అర శాతం లాభంతో ముంది. ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.