ట్రేడింగ్‌లో దూకుడు వొద్దు
ఈవారం ఇన్వెస్టర్లు మార్కెట్‌లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుందని టెక్నికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ పతనం ఖాయమని అంటున్నా… ఎక్కడ మద్దతు లభిస్తుందనే అంశంపై ఎవరూ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. నిఫ్టి 17,000 దిగువకు వెళ్ళడంతో పాటు 16,800 స్థాయిని చేరవచ్చని కొందరు అంటున్నారు. మరికొందరు నిఫ్టి 16500 వరకు మద్దతు ఉండకపోవచ్చని అంటున్నారు. నిఫ్టిని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. కార్పొరేట్ ఫలితాలు, గురువారం వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్, అమెరికాలో ప్రధాన కంపెనీల ఫలితాలు, చైనాలో కరోనా డేటా. శుక్రవారం 3 శాతం దాకా క్షీణించిన అమెరికా మార్కెట్లు ఇవాళ కూడా ఫ్యూచర్స్ ఒక శాతం వరకు నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముఖ్యంగా డే ట్రేడర్స్ దుకూడుగా ట్రేడింగ్‌చేయొద్దని ఏంజిల్ వన్‌కు చెందని టెక్నికల్, డెరివేటివ్స్ చీఫ్ అనలిస్ట్ సమీత్ చావన్ అంటున్నారు. ఎంపిక చేసిన షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నవారు కూడా కొన్నాళ్ళు ఆగడం మంచిదని అంటున్నారు,