For Money

Business News

నేడు షార్ట్‌ కవరింగ్‌?

మార్కెట్‌ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. ఇవాళ సెన్సెక్స్‌ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కూడా. గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా కొంటున్నారు. నిన్నటి భారీ పతనంలోనూ విదేశీ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్ళ రూ. 7000 కోట్ల దాకా ఉన్నాయి. దీంతో ఇవాళ మార్కెట్‌లో షార్ట్‌ కవరింగ్‌ వస్తుందని చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే చిప్‌ షేర్లలో ర్యాలీ కొనసాగడం, ఐటీ కౌంటర్లు పాజటివ్‌గా ఉండటం మరో ప్లస్‌ పాయింట్‌. ఇక పవర్‌ రంగానికి చెందిన షేర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. NTPC ఇప్పటికే గ్రీన్‌లో కొనసాగుతోంది. ఇవాళ టాటా వపర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా నువామా సిఫారసు చేసింది. అలాగే చైనా కంపెనీల ప్రవేశం తరవాత కూడా హితాచి ఎనర్జి రాణిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు కూడా ఇవాళ వెలుగులో ఉండే అవకాశముంది. ఫండ్స్‌ రివాల్వింగ్‌పై ఈ సంస్థలు ఆర్బీఐ తాజాగా తమ అభిప్రాయం తెలిపాయి. దీంతో ఆర్బీఐ తన ప్రతిపాదనలను విరమించుకుంటుందా లేదా వాయిదా వేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే జీడీపీ అనుకున్న స్థాయిలో వృద్ధి చెందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు తగ్గితే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే ఛాన్స్‌ ఉంది. వెరశి ఇవాళ నిఫ్టి 24వేల స్థాయిపైనే ముగిసే ఛాన్స్‌ కన్పిస్తోంది.

Leave a Reply