For Money

Business News

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు కొద్దిసేపటి క్రితం నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి 11 గంటల ప్రాంతంలో 17,324 పాయింట్ల స్థాయిని తాకాయి. అయితే అమెరికా ఫ్యూచర్స్‌తో పాటు ఆసియా మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకోవడంతో నిఫ్టి కూడా క్షీణించింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, డెల్టాను నివారించే వ్యాక్సిన్లనే ఖాతరు చేయమని ఒమైక్రాన్‌… పెద్ద సమస్యగా మారుతుందని మోడెర్నా చీఫ్‌ సైంటిస్ట్‌ హెచ్చరించడంతో అమెరికా డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ ఒకటిన్నర శాతం క్షీణించింది. ఉదయం ఒక మోస్తరు లాభాల్లో ఉన్న ఆసియా సూచీలన్నీ నష్టాల్లోకి జారుకున్నాయి. 17,000 దిగువకు చేరి 16,987ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 17059 వద్ద ఇపుడు ట్రేడవుతోంది. మిడ్‌సెషన్‌లో యూరో మార్కెట్లు ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ యూరో మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తితే నిఫ్టిపై మరోసారి ఒత్తిడి వచ్చే అవకాశముంది.