For Money

Business News

నిఫ్టికి పరిమిత లాభాలే

అమెరికా, ఆసియా మార్కెట్లు దూసుకుపోయినా… మన మార్కెట్లు డల్‌గా ట్రేడయ్యాయి. ముఖ్యంగా యూరప్‌ మార్కెట్లలో జోష్‌ లేకపోవడంతో తాజా పొజిషన్స్‌ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు జంకుతున్నారు. కార్పొరేట్‌ ఫలితాలు అయిపోవడంతో… మార్కెట్‌ను ప్రభావితం చేసే దేశీయ అంశాలు లేవు. మార్కెట్‌ ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. అయితే ఈ అవకాశాన్ని అందరూ లాభాల స్వీకరణనే ఉపయోగించుకున్నారు. దీంతో నిఫ్టి 16,592 నుంచి 16,395 వరకు అంటే దాదాపు 200 పాయింట్లు క్షీణించింది. షార్ట్‌ సెల్లర్స్‌ భారీగా లాభాలు గడించారు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ అధిక స్థాయిలో పొజిషన్స్‌ను క్లోజ్‌ చేయడానికి మొగ్గు చూపారు. దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందడంతో మిడ్‌సెషన్‌లో 16,535 ప్రాంతానికి చేరినా…ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్ల లాభంతో 16,490 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం ఒక శాతంపైగా లాభంతో ఉన్న నిఫ్టి మిడ్ క్యాప్‌ 0.77 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 50 0.5 శాతం నష్టంతో ముగిశాయంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్‌ నిఫ్టి పరిమిత లాభాలతో ముగిసింది.పైకి సూచీలు మాత్రం గ్రీన్‌లో ఉంచుకుతూ… మార్కెట్‌లో జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,164.20 4.19
నెస్లే ఇండియా 19,995.85 2.17
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 15,285.20 2.05
టీసీఎస్‌ 3,628.60 1.94
భారతీ ఎయిర్‌టెల్‌ 622.75 1.47

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అదానీ పోర్ట్స్‌ 667.45 -2.87
ఎం అండ్‌ ఎం 764.80 -2.65
గ్రాసిం 1,447.00 -2.54
టాటా మోటార్స్‌ 276.35 -2.38
బజాజ్‌ ఆటో 3,666.95 -2.25