కనిష్ఠ స్థాయి వద్ద ముగింపు

నిఫ్టి ఇవాళ ఆరంభంలో ఆకర్షణీయ లాభాలు పొందింది. కాని పది గంటల తరవాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఒకదశలో 23938 పాయింట్ల స్థాయికి చేరినా…ఆ తరవాత 23800 స్థాయికి క్షీణించింది. ఇవాళ నిఫ్టి ఓపెనింగ్ 23801, కనిష్ఠ స్థాయి 23800 కాగా… నిఫ్టి క్లోజింగ్ 23813. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 63 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడింది. ఇవాళ ఆటోమొబైల్ , ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టి టాప్ గెయినర్‌గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నా… ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, ఐషర్స్ కూడా టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. మైక్రోఫైనాన్స్ రుణాలను అమ్మేయడంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు రెండున్నర శాతం లాభపడింది. ఇక హిండాల్కో నిఫ్టి టాప్ లూజర్‌గా నిలిచింది. ఎస్బీఐ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీఈఎల్ షేర్లు ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇవాళ మిడ్ క్యాప్ షేర్లు బాగా నిరావర్చాయి.