For Money

Business News

స్పైస్‌జెట్‌ ఆఫర్‌కు మారన్‌ నో…

స్పైస్‌జెట్‌, మారన్‌ల మధ్య వివాదం కొనసాగుతోంది. మారన్‌ సోదరులకు స్పైస్‌జెట్‌ రూ. 920 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మారన్స్‌ నుంచి ప్రమోటర్లు స్పైస్‌జెట్‌ను కొనుగోలు చేశారు. అప్పటి ఒప్పందం మేరకు మారన్‌ సోదరులకు రూ.920 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, స్పైస్‌ జెట్‌ రూ.600 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆ ప్రతిపాదనకు మారన్‌ బ్రదర్స్‌ తిరస్కరించారు. వీరిద్దరూ ఈ వివాదాన్ని మార్చి 2లో పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు గడువు విధించింది. బకాయి ఇవ్వనందుకు స్పైస్‌జెట్‌ను వేలం వేయాల్సిందిగా మారన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ మారన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాలు చేస్తూ స్పైస్‌ ప్రమోటర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.