For Money

Business News

ఒడిశా సీఎంగా మోహన్‌ మాఝీ

ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝీ ఎంపికయ్యారు. ఆయన పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ ప్రకటించారు.
భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు మాఝీను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి భాజపా అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, భూపేందర్‌ యాదవ్‌ హాజరయ్యారు. కనక్‌ వర్ధన్‌ సింగ్‌ డియో, ప్రవటి పరిదాలకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు దక్కాయి. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాఝీ… 1997-2000 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. 2000లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రేపు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు.