23,000 దాటితేనే…

నిఫ్టి ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇపుడు 50 పాయింట్ల నష్టంతో 22,909 వద్ద ట్రేడవుతోంది. సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నా షేర్లు మాత్రం దెబ్బతింటున్నాయి. ప్రధాన సూచీలు ఇవాళ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. దిగువస్థాయిలో మార్కెట్‌కు మద్దతు లభిస్తుందని ట్రేడర్లు భావిస్తున్నారు. సుంకాల కు సంబంధించి భారత్, అమెరికాల ప్రతినిధుల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ నిలకడగా ట్రేడవుతోంది. నిఫ్టిలో 38 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో విప్రో టాప్ గెయినర్ కాగా, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. ఈఏడాది సిమెంట్ కంపెనీల పరిస్థితిపై మోర్గాన్ స్టాన్లీ ఇవాళ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినా.. ఆ రంగానికి చెందిన షేర్లు నష్టాల్లో ఉన్నాయి.