శ్రీరేణుకా సుగర్స్‌కు MACD అనుకూలం
మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే కొన్ని షేర్లలో బుల్లిష్ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. వాటిల్లో శ్రీరేణుక సుగర్స్ ముందుంది. ఇంకా ఓరియంట్ రిఫ్రాక్టరీస్, సుజ్లాన్ ఎనర్జి, పాలిప్లెక్స్ కార్పొరేషన్, ప్రిస్టేజ్ ఎస్టేట్, ప్రిజం జాన్సన్ ఉన్నాయి. 52 వారాల గరిష్ఠ స్థాయిని దాటిన ఈ షేర్లలో బుల్లిష్ సెంటిమెంట్ కన్పిస్తోంది. వీటలో ట్రెండ్ రివర్సల్ కన్పిస్తోంది.
కొన్ని షేర్లలో బేరిష్ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… త్రివేణి టర్బైన్, అదానీ గ్యాస్. ఈ షేర్లలో పతనం ప్రారంభమైనట్లు కన్పిస్తోంది.
నిన్నటి ట్రేడింగ్ చూస్తే… వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జొమాటొ, అదానీ గ్రీన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎం అండ్ ఎంఈ ముందున్నాయి. అదే వాల్యూమ్ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే వోడాఫోన్ ఐడియా, సుజ్లాన్ ఎనర్జి, జీటీఎల్ ఇన్ఫ్రా, జేపీ పవర్, రేణుకా సుగర్స్ ముందున్నాయి.