వెంకీస్… టార్గెట్ రూ. 3400
దీర్ఘకాలిక లాభాలు చూసే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది వెంకీస్. పుణెకు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి మంచి పనితీరు కనబర్చే అవకాశముందని ప్రముఖ అనలిస్ట్ నీరజ్ దీవాన్ అంటున్నారు. ప్రస్తుతం ఈ షేర్ ధర చాలా ఆకర్షణీయంగా ఉందని ఆయన అన్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు రూ. 5200 కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఏడాది- ఏడాదిన్నరలో ఈ కంపెనీ షేర్ ధర రూ. 3400లకు చేరే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ షేర్ రూ.2175 వద్ద ఉంది. నిజానికి ఈ షేర్ జూన్ 21న రూ. 1772కి చేరింది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 19న ఈ షేర్ రూ.3260ను తాకింది. అంటే ఏడాదిలో 52 వారాల గరిష్ఠ స్థాయిని ఈ షేర్ అధిగమించే అవకాశముంది. ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగినందున కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం కన్పించింది. అయితే ఈ ఇబ్బందులను కంపెనీ అధికమించి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించే అవకాశముంది.