నెలాఖరులో ఎల్ఐసీ ఐపీఓ దరఖాస్తు!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఈనెల మూడో వారంలో ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసే అవకాశం ఉంది. ‘జనవరిలోనే పత్రాలను సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. మార్చి 31లోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. మరోవైపు 2021-22లో ఇష్యూ పూర్తికాకపోవచ్చని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.