ఎల్‌ఐసీ షేర్లు 17న లిస్టవుతాయి
భారత దేశపు అతి పెద్ద మెగా పబ్లిక్ ఆఫర్ అయిన ఎల్‌ఐసీ ఐపీఓ మే 4వ తేదీన ప్రారంభమై, 9వ తేదీన ముగుస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. ఇష్యూకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించేందుకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపు మే 2న జరుగుతుందని ఆయన చెప్పారు. ఇష్యూ ధర శ్రేణి రూ. 902 నుంచి రూ. 949 ఉంటుందని ఆయన చెప్పారు. పాలసీహోల్డర్లకు రూ. 60లు, రీటైల్ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు రూ. 45 చొప్పున డిస్కౌంట్‌తో ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మే 17వ తేదీన ఎల్‌ఐసీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టవుతాయని మాథుర్ చెప్పారు. ఆఫర్ తరవాత ఈక్విటీలో 5 శాతం వాటా ఎంప్లాయిస్ వాటా 5 శాతం, పాలసీదారుల వాటా 10 శాతం ఉంటుందని ఆయన అన్నారు.