For Money

Business News

ఎల్‌ఐసీ షేర్‌కు తొలి ప్రధాన గండం

ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లక ప్రధాన గండం ఇవాళ ఎదురు కానుంది. ఇప్పటి వరకు ఈ షేర్‌ దాదాపు 22 శాతం క్షీణించింది. రూ. 949లకు ఈ షేర్‌ను కంపెనీ ఆఫర్‌ చేసింది. పాలసీదారులు, ఉద్యోగులు, రీటైల్ ఇన్వెస్టర్లకు ఈ షేర్‌ను డిస్కౌంట్‌కు జారీ చేశారు. అయితే యాంకర్‌ ఇన్వెస్టర్లకు మాత్రం రూ.949కు అమ్మారు. 123 యాంకర్‌ ఇన్వెస్టర్లకు 5.9 కోట్ల షేర్లను కేటాయించారు. వీరి నుంచి కంపెనీ రూ. 5627 కోట్లను సమీకరించింది. అంటే ఇష్యూలో 25 శాతంపైగా షేర్లను వీరికి కేటాయించారు. ఈ షేర్లపై ఉన్న లాక్‌ఇన్‌ పీరియడ్‌ ఇవాళ్టితో ముగిసింది. లిస్టింగ్‌ తరవాత నెల రోజుల్లోగా వీరు షేర్లను అమ్మరాదనే నిబంధన ఇవాళ్టితో పోతుంది. ఇవాళ్టి నుంచివారు సెకండరీ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. మార్కెట్‌లో లిస్టయిన తరవాత ఈ షేర్‌ పడుతూ వస్తోంది. ఒకవేళ యాంకర్‌ ఇన్వెస్టర్లు దిగువస్థాయిలో కొంటూ వచ్చి ఉంటే … వారి కొనుగోలు సగటు ధర తగ్గి ఉంటుంది. లేదా రూ. 949 వద్ద ఉంది. మరి యాంకర్‌ ఇన్వెస్టర్లు 22 శాతం నష్టంతో షేర్లను అమ్ముకుంటారా? లేదా అలాగే కొనసాగిస్తారా అన్నది ఇవాళ చూడాలి. అయితే యాంకర్‌ ఇన్వెస్టర్లు ఇవాళే అమ్మాల్సిన పనిలేదు. ఇవాళ్టి నుంచి ఎపుడైనా అమ్ముకోవచ్చు. సో… ఇవాళ్టి నుంచి ఎల్‌ఐసీ కౌంటర్‌లో లిక్విడిటీ పెరుగుతుంది. మరి ఎల్‌ఐసీ షేర్‌లో ఇవాళ అమ్మకాల ఉంటాయా? లేదా యాంకర్ ఇన్వెస్టర్లు వేచి చూస్తారా అన్నది చూడాలి.