For Money

Business News

ఇవాళ్టి నుంచి ఎల్‌ఐసీ ఐపీఓ

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఈక్విటీలో 3.5 శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వం అమ్ముతోంది. ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశ ఐపీఓ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ఇదే. ఈ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌ ఈ నెల 9న ముగుస్తుంది. షేర్లు ఈ నెల 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అవుతాయి. రూ.902-949 ధరల శ్రేణిలో జారీ చేస్తున్న ఈ ఐపీఓలో ఒక్కో షేరుపై ఎల్‌ఐసీ పాలసీదారులకు రూ.60 చొప్పున, ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.45 చొప్పున డిస్కౌంట్‌తో ఆఫర్‌ చేస్తున్నారు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన 5.93 కోట్ల షేర్లు ఇప్పటికే పూర్తిగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి.
ఇష్యూ హైలెట్స్‌…
1. LIC IPO ద్వారా సేకరించే మొత్తం రూ . 21,000 కోట్లు

2. ఉద్యోగుల కోసం సుమారు 15.81 లక్షల షేర్లు కేటాయిస్తారు
పాలసీదారుల కోసం 2.21 కోట్ల షేర్లను ఇప్పటికే రిజర్వ్ చేశారు.
3. LIC IPOలో ఒక్కో లాట్లో 15 షేర్లు ఉంటాయి. ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాలి. గరిష్ఠంగా 14 లాట్ల వరకు దరఖాస్తు చేయవచ్చు. ఈ లెక్కన ఒక్కో లాట్‌కు దరఖాస్తు చేసేందుకు కనీసం రూ . 14,235 అవసరం.
4. LIC షేర్లు అనధికార మార్కెట్‌లో రూ. 90 ప్రీమియం లభిస్తోంది. 5. పాలసీదారులకు రూ . 60 తగ్గింపు .. ఎల్‌ఐసీ ఉద్యోగులకు రూ .45 డిస్కౌంట్‌ ఇస్తారు..
6. LIC IPO యాంకర్ ఇన్వెస్టర్లు రూ.13,000 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.