For Money

Business News

ఎల్‌ఐసీ ఐపీఓ అలాట్‌మెంట్‌ పూర్తి

ఎల్‌ఐసీ ఐపీఓ షేర్ల కేటాయింపు పూర్తయింది. ఇప్పటికే షేర్ల కేటాయింపు సమాచారాన్ని ఆయా దరఖాస్తు దారులకు తెలియజేశారు. కేటాయింపు తీరు చూస్తుంటే. సింగిల్ లాట్‌కు దరఖాస్తు చేసినవారికి పూర్తి షేర్ల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. ఒకటి కంటే అధిక లాట్లతో దరఖాస్తు చేసినవారికి దామాషా పద్ధతిలో కేటాయించినట్లు తెలుస్తోంది. రెండు లాట్లకు అలాట్‌ చేసినవారికి 20 షేర్లు కేటాయించారు. అలాట్‌కాని షేర్ల మొత్తాన్ని బ్యాంకులకు తిరిగి ఇచ్చేశారు. షేర్లను రూ. 949 ధర వద్ద కేటాయించారు. రీటైల్‌ ఇన్వెస్టర్లు, పాలసీదారులతో పాటు ఉద్యోగులకు డిస్కౌంట్‌తో షేర్లను కేటాయించారు. షేర్ల కేటాయింపు ద్వారా ప్రభుత్వానికి రూ. 20,557 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. షేర్లు ఈనెల 17న లిస్ట్‌ కానున్నాయి.