ఎల్‌ఐసీ ఐపీఓ: 80 శాతానికి బిడ్డింగ్
దేశంలో అతి పెద్ద పబ్లిక్ ఆఫర్ అయిన ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్‌కు రెండో రోజు కూడా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఇష్యూలో 80 శాతానికి ఇన్వెస్టరర్లు దరఖాస్తు చేశారు. ఇష్యూలో తమకు కేటాయించిన షేర్లకు 2.44 రెట్లు అధిక షేర్లకు పాలసీదారులు దరకాస్తు చేశారు. ఇక ఉద్యోగులు కూడా తమ కోటాకు 1.62 రెట్లు అధికంగా దరకాస్తు చేశారు.అయితే రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇంకా 73 శాతం వరకే దరఖాస్తులు వచ్చాయి. ఇక యూఐబీ వాటాలో కేవలం 34 శాతం వరకు దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా ఈ కేటగిరి షేర్లకు చివరి రోజు దరఖాస్తులు వస్తాయి. ఈ పబ్లిక్ ఆఫర్ ఈనెల 9న ముగియనుంది. శనివారం కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు.