వచ్చేవారం ఎల్‌ఐసీ బోర్డు భేటీ
ఈనెల 30వ తేదీన ఎల్‌ఐసీ బోర్డు సమావేశం కానుంది. మార్చి తో ముగిసిన త్రైమాసికంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఫలితాలను బోర్డు పరిశీలించనుంది. ఇదే బోర్డు సమావేశంలో డివిడెండ్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. షేర్ లిస్ట్ అయిన తరవాత కంపెనీ తొలిసారి ఫలితాలను పరిశీలించనుంది. ఇవాళ బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేర్ 1.59 శాతం పెరిగి రూ. 829.85 వద్ద ముగిసింది.