అదరగొట్టిన ఎల్ఐసీ
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అదరగొట్టే ఫలితాలు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ. 1,433 కోట్ల నికర లాభం ప్రకటించగా… ఈ త్రైమాసికంలో రూ. 15,952 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అలాగే నికర ప్రీమియం ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే 27 శాతం పెరిగి రూ. 1.32 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో నికర ప్రీమియం ఆదాయం రూ. 1.04 లక్షల కోట్లు. స్థూల ఎన్పీఏల శాతం కూడా తగ్గింది. ఫస్ట్ ఇయర్ ప్రీమియం 11 శాతం పెరిగి రూ. 9125 కోట్లకు, రెన్యూవల్ ప్రీమియం 2 శాతం పెరిగి రూ. 56,156 కోట్లకు చేరినట్లు ఎల్ఐసీ పేర్కొంది. అలాగే సింగిల్ ప్రీమియం ఆదాయం 62 శాతం పెరిగి రూ. 66,901 కోట్లకు చేరినట్లు తెలిపింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్పీఏల శాతం 5.84 శాతం కాగా, ఈ త్రైమాసికంలో 5.6 శాతానికి క్షీణించింది. ప్రస్తుత త్రైమాసికంలో ఇతర ఆదాయం కూడా రూర. 160 కోట్ల నుంచి రూ. 6800 కోట్లకు పెరిగింది.