లారస్ ల్యాబ్ నుంచి హెచ్ఐవీ మందు
పిల్లల్లో హెచ్ఐవీ వ్యాధిని అదుపు చేయడానికి వీలుకల్పించే మందులను తయారీకి లారస్ ల్యాబ్స్ రెడీ అవుతోంది. దీని కోసం యునైటెయిడ్, ద క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనీషియేటివ్ (సీహెచ్ఏఐ) తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్ఐవీకి ‘సెకండ్ లైన్/ థర్డ్ లైన్ ట్రీట్మెంట్’ అయిన డారునవిర్, రిటనవిర్ (డీఆర్వీ/ఆర్) కాంబినేషన్ ఔషధాలను వాణిజ్య ప్రాతిపదికన మార్కెట్లోకి లారస్ ల్యాబ్స్ విడుదల చేస్తుంది. ఈ ఔషధాల అభివృద్ధికి అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని ఈ అంతర్జాతీయ సంస్థలు భరిస్తాయి.