For Money

Business News

ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 1,655

మార్కెట్‌లో ఫార్మా షేర్ల హవా నడుస్తోంది. అనేక స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫార్మా షేర్లు ఇటీవల బాగా పెరిగాయి. అనేక సంవత్సరాల తరవాత ఈ షేర్లలో బ్రేకౌట్‌ కన్పిస్తోంది. తాజాగా ఎమ్‌క్యూర్‌ ఫార్మా షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సిఫారసు చేసింది. దీంతో ఈషేర్‌ ఇవాళ 5 శాతం పెరిగి రూ. 1580లను తాకింది. లాభాల స్వీకరణతో రెండు శాతంపైగా లాభంతో రూ.1527 వద్ద ముగిసింది. సమర్థమైన ఆర్‌ అండ్ డీ కారణంగా కంపెనీ చక్కటి ప్రొడక్ట్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసిందని కొటక్‌ పేర్కొంది. అమెరికా, కెనడాలలో ఈ కంపెనీపై ఉన్న కేసుల కారణంగా మున్ముందు కొన్ని కీలక రిస్క్‌లు ఉన్నా… కంపెనీ ఫలితాలు చాలా పటిష్ఠంగా ఉన్నాయని పేర్కొంది. అమెరికా జనరిక్స్‌తో ఎలాంటి సంబంధం లేని అతికొన్ని కంపెనీల్లో ఎమ్‌క్యూర్‌ ఒకటని కొటక్‌ పేర్కొంది. ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 1,655గా కొటక్‌ పేర్కొంది. మ్యాన్‌కైండ్‌, టొరెంట్‌, జేబీ కెమికల్స్‌ వంటి కంపెనీల షేర్లతో పోలిస్తే ఎమ్‌క్యూర్‌ షేర్‌ చాలా డిస్కౌంట్‌కే లభిస్తోందని కొటక్‌ పేర్కొంది. దేశీయ అమ్మకాలపరంగా చూస్తే దేశంలోని అతి పెద్ద కంపెనీల్లో 15వ స్థానంలో ఎమ్‌క్యూరో ఉంటోంది. భారత్‌, కెనడా, యూరప్‌తో పాటు ఇతర వర్ధమాన మార్కెట్లలో కంపెనీ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ ఉందని, సనోఫీతో ఈ కంపెనీకి ఉన్న ఒప్పందం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని కొటక్‌ పేర్కొంది.

Leave a Reply