బుకింగ్స్ ప్రారంభం

కియా ఇండియా కొత్త సైరస్ కంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తెస్తోంది. ఇవాళ్టి నుంచే బుకింగ్ ప్రారంభించింది. రూ. 25000 డిపాజిట్ చేసి కారును బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీన కారును మార్కెట్‌లోకి తెస్తున్నట్లు కియా ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్స్‌లో వస్తున్న ఈ కారు ధర రూ. 9.70 లక్షల నుంచి రూ. 16.50 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్ ధర) ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్స్‌ను బట్టి కారు ధరలో మార్పు ఉంటుంది. ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇపుడు హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాంట్ విటారాకు కియా సైరస్ గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. అలాగే కాంపాక్ట్ మోడల్స్ అయిన టాటా నిక్సన్, కియా సోనెట్‌తో పాటు మారుతీ బ్రెజా కూడా సైరస్ పోటీగా నిలిచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.