కియా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది..
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా తన తొలి ఎలక్ట్రిక్ కారును సోమవారం ఆవిష్కరించింది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 సెడాన్‌గా పేరున్న ఈ ఎలక్ట్రిక్ కారు ధర కొరియాలో 40,800 డాలర్ల నుంచి 49,500 డాలర్ల మధ్య ఉండొచ్చు. ఏడాది చివరికల్లా ఈ కారు రోడ్డుపైకి వచ్చే అవకాశముంది. కొత్త మోడల్‌కు 30,000కు పైగా ప్రీఆర్డర్లు వచ్చాయి.ఇక యూరప్, అమెరికాలో 8,800 ప్రీఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలోపు దక్షిణ కొరియాలో 3,000 యూనిట్లను, విదేశీ మార్కెట్లలో 17,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈవీ కార్లపై దక్షిణ కొరియా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే తమ కారు ధర 34,761 డాలర్ల(రూ.25 లక్షల) కంటే తక్కువకేఉ లభిస్తుందని కియా అంటోంది. ఈ ఈవీ6 మోడల్ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తోంది. స్టాండర్డ్ 58 కిలోవాట్-అవర్ (kwh) బ్యాటరీ కారును ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 370 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ 77.4-kwh బ్యాటరీతో 475 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది 3.5 సేకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీనిని 5 నిమిషాలు చార్జ్ చేస్తే 100 కి. మీ దూరం వరకు వెళ్లవచ్చు.