NIFTY TODAY: 17,240 కీలకం
మార్కెట్ ప్రారంభ సమయానికి సింగపూర్ నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చేసింది. సో… మార్కెట్ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి నెల డెరివేటివ్స్ ప్రారంభం కానున్నాయి. అమెరికా మార్కెట్ల పతనం పూర్తిగా ఐటీ, టెక్ షేర్లకు సంబంధించినది. డౌజోన్స్ దాదాపు స్థిరంగా ముగిసింది. మన మార్కెట్ విషయానికొస్తే డాలర్ పెరగడం, క్రూడ్ కూడా పెరగడం. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టి లెవల్స్ ఇలా ఉన్నాయి.
నిఫ్టికి కీలక స్థాయి… 17085
తొలి ప్రతిఘటన… 17240
రెండో ప్రతిఘటన… 17285
అప్ బ్రేకౌట్… 17355
పడితే తొలి మద్దతు 16,979
రెండో మద్దతు స్థాయి 16935
నిఫ్టి ఇప్పటికే ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నందు… ఇవాళ మార్కెట్ కోలుకునే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు. టెక్నికల్‌గా బై సిగ్నల్స్ ఉన్నాయి. వచ్చేవారం బడ్జెట్ ఉన్నా… మార్కెట్ పెద్ద పట్టించుకున్నట్లు లేదు. సో… టెక్నికల్స్ ప్రకారం ట్రేడ్ చేయడం మంచిది.