లిస్టింగ్ రోజే 100 శాతం లాభం

ఒకవైపు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల తాజా డార్లింగ్ కళ్యాణ్ జువలర్స్ దారుణంగా పడుతుంటే… ఇవాళే లిస్టయిన కాబ్రా జువెలర్స్ లిస్టింగ్ రోజే వంద శాతం లాభాలను అందించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఈ కంపెనీ షేర్ ఇష్యూ ధర రూ.128 కాగా.. ఎన్‌ఎస్‌ఈలో రూ.255.35 వద్ద ముగిసింది. అయిదు శాతం అప్పర్ సీలింగ్‌తో ఈ షేర్ క్లోజ్ కావడం విశేషం. ఈ ధర వద్ద అమ్మకందారులే లేరు. ఎస్‌ఎంఈ విభాగం నుంచి వచ్చిన ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.40 కోట్లు సమీకరించనుంది. ఎస్‌ఎంఈ విభాగంలో షేర్ల ధరల్లో మాయ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు వస్తున్నా… ఈ విభాగంలో షేర్లు భారీ ప్రీమియంతో లిస్ట్ కావడం గమనార్హం.పైగా పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించడం వినా… వ్యాపార విస్తరణ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం. మరి ఈ షేర్‌కు ఇంత భారీ ప్రీమియం చెల్లించాలనే విమర్శలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.