For Money

Business News

జిందాల్‌ సా చేతికి శాతవాహన?

హైదరాబాద్‌కు చెందిన శాతవాహన ఇస్పాత్‌ కంపెనీని పృథ్విరాజ్‌ జిందాల్‌ ప్రమోట్‌ చేసిన జిందాల్ సా (Jindal Saw) చేతికి వెళ్ళనుంది. కంపెనీ దివాలా తీసినందున శాతవాహన ఇస్పాత్‌ కొనుగోలుకు బిడ్‌లను ఆహ్వానించారు. జిందాల్ సా కంపెనీ రూ. 530 కోట్లు ఆఫర్‌ చేసింది. ఇదే అత్యధిక మొత్తం. వేదాంత కంపెనీ కూడా శాతవాహన ఇస్పాత్‌ కోసం ప్రయత్నిస్తోంది.