For Money

Business News

ఐవీఆర్‌సీఎల్‌ వేలం 15న

ఖాయిలా పడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంస్థ IVRCLను విక్రయించడం (లిక్విడేషన్‌) కోసం డిసెంబరు 15న ఇ-వేలం (ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వేలం) నిర్వహించనున్నారు. దీనికి బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌) నియమించిన లిక్విడేటర్‌ సుతాను సిన్హా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రీ-బిడ్‌ అర్హతకల సంస్థలు ఇందులో పాల్గొనవచ్చు. ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్‌కు రూ.1200 కోట్ల కనీస ధర (రిజర్వు ప్రైస్‌) నిర్ణయించారు. ఈ వేలం ఎన్‌సీఎల్‌టీ నిబంధనలకు లోబడి ఉంటుందని లిక్విడేటర్‌ పేర్కొన్నారు. ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను డిసెంబరు 10 లోగా దాఖలు చేయాలి.