బ్యాంక్ షేర్ల దెబ్బ పడినా…
వీక్లీ డెరివేటివ్స్ ముగింపు మార్కెట్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బ్యాంక్ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమైనా… క్రమంగా బలహీనపడుతూ చివరల్లో నష్టాల్లోకి జారిపోయింది. దీన్నే స్పష్టంగా ప్రతిబింబిస్తూ నిఫ్టికి కూడా అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది.అయితే బ్యాంకు షేర్లకు భిన్నంగా ఐటీ, రియల్ ఎస్టేట్ షేర్లు నిఫ్టికి అండగా నిలిచాయి. దీంతో నిఫ్టి లాభాల్లో ముగిసింది. తమ దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నా… వృద్ధి బాటలో బాగా రాణించామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. వడ్డీ రేట్లలో మార్పు లేకపోయినా… ఈ ఏడాది కచ్చితంగా వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. దీంతో ఆసియా మార్కెట్లు కూడా ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. ఇక మన మార్కెట్ విషయానికి వస్తే ఒపెనింగ్‌లోనే నిఫ్టి, సెన్సెక్స్ జీవితకాల కొత్త గరిష్ఠ స్థాయిలను తాకియి. నిఫ్టీ ఇవాళ ఒపెనింగ్‌లోనే 23481 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. తరవాత బలహీన పడుతూ 23,353 పాయింట్లకు చేరింది. ఇదే స్థాయలో దాదాపు రోజంతా కొనసాగి 75.95 పాయింట్ల లాభంతో 23,398.90 వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 77,145.46 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకున్నా… 204 పాయింట్ల లాభంతో 76,810 వద్ద క్లోజైంది. నిఫ్టి50లో శ్రీరామ్ ఫైనాన్స్ ఇవాళ టాప్ గెయినర్‌గా నిలిచింది.ఈ షేర్ దాదాపు అయిదు శాతం లాభపడింది. తరవాత ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, దివీస్ ల్యాబ్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. హిందుస్థాన్ లీవన్ టాప్ లూజర్‌గా నిలిచింది. స్మాల్ క్యాప్ సూచీ మిడ్ సెషన్ తరవాత సూపర్ లాభాలతో ముగిసింది. చోళ మండళం ఫైనాన్స్, సీమన్స్, హెచ్‌ఏఎల్, బీఈఎల్, జొమాటొ షేర్లు మూడు శాతంపైగా లాభపడ్డాయి. మిడ్ క్యాప్‌లో గోద్రేజ్ ప్రారపర్టీస్ టాప్ గెయినర్‌గా నిలిచింది.