For Money

Business News

రాజకీయ విరాళాలపై ఐటీ కన్ను?

రాజకీయ పార్టీలకు రూ. 5 లక్షలకు మంచి విరాళం ఇచ్చినవారికి ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు వెళ్ళాయి. ఏ పార్టీకి ఇచ్చారు? విరాళాల కోసం ఎవరు వచ్చారు? విరాళం తీసుకుంటున్న పార్టీ మీ నియోజకవర్గంలో పోటీ చేస్తోందా? పార్టీకి విరాళం ఇచ్చే ముందు దానికి సంబంధించి కనీస వివరాలు తెలుసుకున్నారా? ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ గురించి మీకు ఎలా తెలిసింది? వంటి ప్రశ్నలకు సుమారు 9000 మందికి ఐటీ విభాగం నుంచి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. 2020-21 ఏడాదికి సంబంధించి ఇలాంటి వివరాలను ఐటీ విభాగం అడిగింది. చాలా మంది రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చి… వాటి నుంచి నగదు తీసుకుంటారు. దీనికి గాను వారికి ఒకటి నుంచి మూడు శాతం కమిషన్‌ లభిస్తుందని ఐటీ విభాగం అనుమానిస్తోంది. దీంతో చిన్నా చితక… అసుల ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి కూడా కొందరు విరాళాలు ఇచ్చినట్లు తమ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. రాజకీయ విరాళాలపై ఎలాంటి పరిమితి లేకపోవడం, అలాగే ఇలాంటి విరాళాలకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉండటంతో… చాలా వరకు విరాళాలు.. కమీషన్‌ కోసమేనని భావిస్తోంది ఐటీ విభాగం.