For Money

Business News

ఇపుడైనా ఈ షేర్‌ కొనొచ్చా?

మార్కెట్‌ను ఇవాళ దెబ్బతీసిన షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒకటి. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, నెట్‌వర్క్‌ 18 షేర్లు లాభాలతో క్లోజ్‌ కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెండు శాతం క్షీణించింది. కంపెనీ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో ఈ షేర్‌ 2.06 శాతం నష్టంతో రూ. 2688 వద్ద ముగిసింది. నిఫ్టిలో రిలయన్స్‌కు ఉన్న వెయిటేజీ ఎక్కువ. నిఫ్టి నష్టంలో ఈ కౌంటర్‌ పాత్ర అధికం. టీవీ బ్రాడ్‌కాస్ట్‌ దాదాపు 7 శాతం లాభపడగా, నెట్‌వర్క్‌ 18 షేర్‌ పది శాతం లాభ పడింది. మరోవైపు రిలయన్స్‌కు మద్దతుగా పలు బ్రోకింగ్ సంస్థలు రికమెండేషన్‌లు ఇవ్వడం విశేషం. రూ. 3400 టార్గెట్‌ కోసం ఈ షేర్‌ను కొనొచ్చని జెఫరీస్‌ పేర్కనగా, రూ. 3450 టార్గెట్‌గా నొమురా పేర్కొంది. ఇక సిటీ టార్గెట్‌ రూ. 2900 కాగా, మోర్గాన్‌ స్టాన్లీ ఇచ్చిన టార్గెట్‌ రూ. 3325. టెక్నికల్‌ అనలిస్ట్‌లు మాత్రం రిలయన్స్‌ షేర్‌ రూ. 2800 స్థాయిని పటిష్ఠంగా దాటిన తరవాతే కొనే అంశాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు.